21 ఏప్రిల్, 2007

వెలితి

నాలో ఎక్కడో ఒక వెలితి
అస్పౄస్యం, అభౌతికమైన వెలితి
ఉబికి వచ్చె నా ఆవేశాన్ని అంతటినీ
ఒక్క గుక్కలొ మింగివేస్తూ
జాడ మాత్రం చ్చిక్కనివ్వని
కౄష్ణబిలం ఆ వెలితి
నాలో భావాలన్నిటినీ పంచితే
ముభావంగా అందుకుని
కనుమరుగయ్యె
నేస్తం ఆ వెలితి
నాలో చేలరేగే ఏ భావం దాన్ని నింపగలదో
నన్ను చేరే ఏ నేస్తం దాన్ని మరువజేయగలదో